తెలంగాణలో వర్షాల పరిస్థితిపై హైదారాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వచ్చే కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో స్పష్టతనిచ్చారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట మేఘాలు కమ్ముకున్నప్పటికీ ఎండ కూడా ఉడికించేలా ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, భారీ వర్షాలకు ఎక్కడా అవకాశముండదని చెప్పారు.ప్రస్తుతం అరేబియా సముద్రం (Arabian Sea) లో శ్రీలంకకు దిగువన ఒక ఆవర్తనం ఏర్పడిందని, ఇది జులై 31 లేదా ఆగస్టు 1 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం కదలికల దిశ ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ప్రభావం ఎంతమేర ఉంటుందో నిర్ణయించబడుతుందని చెప్పారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అల్పపీడనం పశ్చిమాన కదిలితే మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముండగా, ఈశాన్య దిశగా కదిలితే తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) వర్షాలు పెరుగుతాయని తెలిపారు.వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ భారతదేశం అంతటా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. దీంతో పాటు, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, దక్షిణ మహారాష్ట్రలో వారం రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం నుంచి ఉత్తరానికి గాలులు వీస్తున్నాయని, తెలంగాణలో గంటకు 15 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 29 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పారు.
జలాశయాలు జలకళను
వేడి గాలులు తిరిగి ఎండా కాలాన్ని గుర్తు చేస్తాయన్నారు. మెుత్తంగా వారం పాటు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం లేదని అన్నారు.ఇటీవల తెలంగాణలో కుండపోత వర్షాలు కురిశాయి. పది రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లను జులైలోనే ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. సాగర్ గేట్లు ఎత్తటంతో పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు.
వర్షం వల్ల కలిగే మూడు ప్రయోజనాలు ఏమిటి?
వ్యవసాయానికి మేలు, నీటి వనరుల పునరుత్పత్తి,పర్యావరణ సమతుల్యత.
వర్షపు నీరు 100% స్వచ్ఛమైన నీరేనా?
కాదు, వర్షపు నీరు 100% స్వచ్ఛమైన H₂O కాదు. సహజసిద్ధంగా పూర్తిగా స్వచ్ఛమైన నీరు ప్రకృతిలో దొరకదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: MLC Kavitha : కవిత గురించి మాట్లాడటం టైం వెస్ట్ – జగదీశ్ రెడ్డి