📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

TG Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరికలు

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మళ్లీ వర్షాలు చెలరేగాయి.గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి (జూలై 11) మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains) కొనసాగుతాయని అన్నారు.నేడు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.

వర్షం కురిసే సమయంలో అత్యవసరం

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు (Thunderbolts) కూడా పడే ఛాన్స్ ఉన్నందున వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.ఈ ఏడాది వర్షాకాలంలో తెలంగాణలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం, నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో 131.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.

TG Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు హెచ్చరికలు

కొన్ని ప్రాంతాల్లో

అయితే ఈ కాలానికి రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం 140.7 మి.మీ.గా ఉంది. ఈ కొద్దిపాటి లోటు కారణంగానే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో సరైన వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు (Farmers) ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో లోటు వర్షాలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా పత్తి వంటి పంటలు దెబ్బతింటున్నాయి.ఈ వర్షాల కారణంగా పంటలకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ఓవర్ ఫ్లో వల్ల వరి నారుమలలు, మొక్కజొన్న, పత్తి పంటలపై దెబ్బపడే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

Rain నెట్‌వర్క్ కంపెనీతో సంప్రదించాలంటే ఏ నంబర్‌కి కాల్ చేయాలి?

Rain నెట్‌వర్క్‌కి సంబంధించిన ఏదైనా సమాచారం కోసం లేదా ఫిర్యాదు చేయాలంటే, Customer Engagement Centre ను సంప్రదించవచ్చు.దీనికి సంబంధించిన ఫోన్ నంబర్: 081 610 1000.ఈ నంబర్‌కి కాల్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చు.

వర్షపు నీరు 100% నీరేనా?

లేదు. వర్షపు నీరు 100% శుద్ధమైన నీరు కాదు. నీరు ఒక అద్భుతమైన ద్రావకంగా (solvent) పనిచేస్తుంది. కాబట్టి వర్షం పడేటప్పుడు, ఇది వాతావరణంలో ఉన్న వివిధ వాయువులను (లేదా రాసాయనాలను) కలిపి తీసుకురాగలదు. అందువల్ల వర్షపు నీటిలో కొన్ని గ్యాసులు లేదా ఇతర ద్రావణాలు కలిసివుంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: KCR: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

Breaking News Heavy Rainfall in Telangana Hyderabad weather update IMD Telangana Forecast July 2025 Weather latest news Rains in Hyderabad Telangana rain alert Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.