బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో – రానున్న రోజుల్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వీధులను, రోడ్లను జలమయంగా మార్చడం తోపాటు, విద్యుత్ సరఫరాపైన, ట్రాఫిక్‌పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.
వాతావరణ పరిస్థితుల కారణంగా, పంటలకు, వ్యవసాయ కార్యకలాపాలకు కూడా పెద్దగా హాని కలగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాలైన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
భారీ వర్షాలకు ఛాన్స్
నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: