తెలంగాణ రాష్ట్రంలో జులై చివరి వారంలో వరుసగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దాదాపు పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు నిండిపోయి, పంటల సాగుకు కొంత ఊరట లభించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జులై చివరి రోజుల్లో కురిసిన ఈ భారీ వర్షాల తర్వాత ఆగస్టు నెల ప్రారంభమైన మూడు రోజులకే రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా పొడి మోడ్‌లోకి మారింది.గత 5 రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా వర్షాలు పడకపోవడంతో, చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. ఈ కారణంగా పగటి పూటలు మరింతగా వేడెక్కి, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పొలాల్లో విత్తనాలు వేసిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్నారు.
తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో నేడు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షాలు కురుస్తాయని అన్నారు. స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వీచే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో నేడు భారీ వర్షాలకు (heavy rains) ఛాన్స్ మాత్రం లేదని చెప్పారు. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోత కూడా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఉదయం కాస్త ఎండగా ఉన్నా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది
సోమవారం (ఆగస్టు 4న) రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయన్నారు.
వర్షం మన జీవితానికి ఎంత ముఖ్యమైంది?
వర్షం వల్ల నీటి వనరులు సమృద్ధిగా లభిస్తాయి. వ్యవసాయం, త్రాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పునరుద్ధరణ, పర్యావరణ సమతుల్యత కోసం వర్షం కీలకమైనది.
వర్షం ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి?
నీటి ఆవిరీభవనం (Evaporation),గాలిలో నీటి ఆవిరి సంతృప్తి చెందడం (Condensation),మేఘాలు బరువెక్కి నీటి బిందువులు కురవడం (Precipitation).
Read hindi news: hindi.vaartha.com
Read Also: