📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: జగన్, కేసీఆర్‌పై ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, (YS Jagan) కేసీఆర్‌పై(TG) తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడికూర తిన్నారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటి తీరులో వ్యవహరించరని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై గతంలో జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలపై మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలను ఉన్నతస్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు, జల వనరుల కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా సమావేశమై చర్చించాలని సూచించారు.

Read Also: Telangana: చిన్నమ్మతో సహజీవనం.. అన్న ప్రాణాలు తీసిన తమ్ముడు

President Jagga Reddy criticizes Jagan and KCR.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. (TG) 1970లో ఇందిరాగాంధీ పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. రూ.14,000 కోట్ల వ్యయంతో స్థాపించిన ఈ పరిశ్రమ విశాఖపట్నం అభివృద్ధి చెందింది అన్నారు. వేలాది కుటుంబాలు ఈ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు అని జగ్గారెడ్డి చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ వచ్చారు. అయితే మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు కట్టపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Jagan Mohan Reddy jaggareddy KCR Latest News in Telugu Telangana politics Telugu News vizag steel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.