📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Telugu News: TG: ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో, ఎస్ఐబీ (SIB) మాజీ బాస్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టడీ విచారణ మూడవ రోజూ కొనసాగింది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (SIT) విచారణాధికారి ఏసీపీ వెంకటగిరి కార్యాలయంలో ఈ విచారణ ఆదివారం నాడు ఆరు గంటల పాటు జరిగింది. శుక్ర, శనివారాలతో పోలిస్తే, ఆదివారం నాడు విచారణ ప్రధానంగా సాంకేతిక అంశాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన ఈ కేసులో అప్పటి పాలకుల పాత్రకు సంబంధించిన ఆధారాలను వెలికి తీసేందుకు సిట్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

Read Also: Revanth Reddy: తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

TG Prabhakar Rao’s investigation into phone tapping continues

అధికారుల ఆదేశాల మేరకు ట్యాపింగ్: ఒత్తిడిని అంగీకరించిన ప్రభాకర్ రావు

విచారణ సందర్భంగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఎవరి ఆదేశాల మేరకు ముందుకు వెళ్లారు, మరియు కిందిస్థాయి అధికారులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఎందుకు ఆదేశించారు అనే అంశాలపై సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నించింది. దీనికి ప్రభాకర్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.

నాటి ఉన్నతాధికారులను మరోసారి విచారించనున్న సిట్

ప్రభాకర్ రావు వెల్లడించిన సమాచారం ఆధారంగా, అప్పటి సీఎం కేసీఆర్ పేషీ అధికారులతో పాటు, నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, నిఘా విభాగం బాస్ అనిల్ కుమార్లను కూడా మరోసారి విచారించాలని సిట్ బృందం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు విచారణ గురువారం వరకు సాగనుండడంతో, ఈ లోపు వీరిని విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ఇప్పటికే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, నాటి నిఘా విభాగం బాస్‌లు నవీన్ చంద్, అనిల్ కుమార్ల వాంగ్మూలాన్ని సిట్ బృందం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యి, బెయిలుపై విడుదల కావడం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Phone Tapping Case Prabhakar Rao former SIB boss SIT office Jubilee Hills six hours of questioning Sunday interrogation Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.