తెలంగాణ (TG) రాజకీయాల్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును (Harish Rao) సిట్ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో ఆయన ఈ ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన ఒక్కడినే స్టేషన్‌లోకి అనుమతించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సిట్ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్ లోపలికి పోలీసులు అనుమతించలేదు.
గడచిన మూడుగంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో విరామం ప్రకటించగా హరీశ్‌రావు ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ కంటీన్యూ చేశారు. హరీశ్‌రావును విచారణకు పిలిచారని తెలిసి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: Phone Tapping Case : ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ – కేటీఆర్
పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని(TG) సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా హరీశ్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అనంతరం రెండో విడత విచారణ ప్రారంభం కానుంది. మొదటి సెషన్‌లో వచ్చిన సమాధానాల ఆధారంగా మధ్యాహ్నం తర్వాత మరిన్ని కీలక ప్రశ్నలు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. విచారణ ముగియటంతో తర్వాత సిట్ అధికారులు గానీ, హరీష్ రావు గానీ మీడియాకు ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: