తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది..రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కొండల్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారని దర్యాప్తులో తేలింది.
Read Also: Medak: అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్

రేపు ఉదయం 11 గంటలకు హాజరు
ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం తీసుకోవడం కోసం విచారణకు పిలుస్తున్నారు.ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు కూడా ఇలాంటి నోటీసులు జారీ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: