తెలంగాణ (TG)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.
Read Also: Telangana: మద్యం ప్రియులకు షాక్
సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది
ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఇప్పుడు కేటీఆర్ ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: