📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం

Author Icon By Anusha
Updated: February 1, 2026 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ఫోన్ ట్యాపింగ్‌ కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నందినగర్‌ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆదివారం మధ్యాహ్నం పలు డాక్యుమెంట్లతో హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సిట్ అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ విచారణ కోసం KCR ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు.విచారణకు సిట్ అధికారులు పూర్తి సన్నద్ధతతో రాగా, కేసీఆర్ కూడా తన వెంట ఒక నోట్‌బుక్, కొన్ని ముఖ్యమైన పత్రాలను తెచ్చుకున్నారు.

Read Also: Excise Constable:సౌమ్య కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగ హామీ

TG: Phone tapping case.. KCR investigation begins

గదిని పూర్తిగా తనిఖీ చేశారు

సిట్ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.విచారణ మొదలుకాకముందే సిట్ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలతో కేసీఆర్ గదిని పూర్తిగా తనిఖీ చేశారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో రికార్డ్ చేస్తున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే ఇంట్లోకి అనుమతించారు.అయితే.. విచారణ జరుగుతున్న గదిలోకి ఎవరినీ.. కనీసం లాయర్‌ను కూడా అనుమతించలేదని సమాచారం. ఎర్రవల్లి నుంచి వస్తున్న సమయంలో భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని.. కేవలం కేసీఆర్ వాహనాలను మాత్రమే అనుమతించారు.

ప్రస్తుతం విచారణ కొనసాగుతుండగా.. ఆయన నివాసంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గత ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులతో సహా దాదాపు 600 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుతో పాటు, కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

KCR latest news Phone Tapping Case sit investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.