ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. తెలంగాణ (TG) లోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన శనివారం (నేడు) సందర్శించనున్నారు. అక్కడ టీటీడీ సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ (TG) జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో భేటీ కానున్నారు.
ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లతో భేటీ అవుతారు.10.30am-11.30am మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయని జనసేన పార్టీ తెలిపింది. ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేసేలా మండపాన్ని నిర్మించనున్నారు. సత్రంలో 96 విశ్రాంతి గదులు ఉండనున్నాయి.
Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT
ప్రత్యేక పూజలు
మరోవైపు పవన్ కళ్యాణ్.. కొండగట్టు అంజన్నను ఇలవేల్పుగా కొలుస్తారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పడే ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి.
భక్తుల కోసం కొండగట్టులో దీక్ష విరమణ మండపంతో పాటుగా.. ఓ సత్రం అవసరం ఉందని.. వీటిని ఏర్పాటుచేయటంలో సహకరించాల్సిందిగా అధికారులు, ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: