తెలంగాణ (TG) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై ఈ నెల 30న స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. విచారణకు హాజరుకావాలని దానం నాగేందర్‌తో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, న్యాయవాదులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అదే రోజు భాజపా నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. పిటిషనర్ల తరఫున సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేయనున్నారు.
Read Also: Narcotics: ఉపేక్షిస్తే ఉపద్రవమే!
ఎటువంటి ఆధారాలు లేవు
దానం నాగేందర్ గతంలో పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు. దీంతో స్పీకర్ నోటీసులకు ప్రాధాన్యం ఏర్పడింది. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను, స్పీకర్ కొట్టేశారు.
వారు పార్టీ మారారు అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయితే దానం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ దానం నాగేందర్, ను అనర్హుడిగా ప్రకటిస్తే అప్పుడు ఈ స్థానంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: