హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల(TG Panchayat Elections)ను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలు చేసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దులో చెకోపోస్టులు(Checkpoints) ఏర్పాటు చేశారు. కూసుమంచి మండలంలోని నాయికన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఆరు వాహనాలను తనిఖీ చేసిన అనంతరం
హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ఆరు వాహనాలను తనిఖీ చేసిన అనంతరం పంపించారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాల్లో సిఎం పాల్గొననున్నారు. ఆయన కాన్వాయి వాహానాలు ముందుగా అక్కడికి పంపారు. తెలంగాణ(Telangana) ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన ప్రాంతాలలో పోలీసులు నిఘా పెంచారు. మద్యం, డబ్బులు, అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నిం చడం సోదాచేయడం జరుగుతోంది.
ఆదిలాబాద్ జిల్లా బోరజ్, కొమురంభీం జిల్లా వాంకిడి, కామారెడ్డి జిల్లా మద్దునూర్ మండలం సలాబత్పూర్, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. మాడ్లీ వద్ద హైదరాబాద్- ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై నిరంతర నిఘా ఉంటుంది. రాష్ట్ర సరిహద్దు ప్రధాన రోడ్లలో మాత్రమే 24 గంటలూ వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: