📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu News: TG: పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్‌ విజయాలు

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ( TG) గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలతో రాజకీయ సందడి నెలకొంది. చాలా కాలం తర్వాత పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఉప్పొంగింది. మూడు దశలుగా నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా, ఈ నెల 17న మూడో దశతో కొత్త పాలకవర్గాలు గ్రామాలకు రానున్నాయి. ఆదివారం జరిగిన( TG) రెండో దశ పోలింగ్‌లో ఓటర్లు, ముఖ్యంగా యువత, ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ దశలో అనేక చోట్ల ఒక్క ఓటుతో ఫలితం తేలడం ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది.

Read Also: Medak Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

TG

నిజామాబాద్‌లో ఒక్క ఓటు గెలుపు
నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో మల్లెల సాయిచరణ్‌, కాంగ్రెస్ మద్దతుతో చిట్యాల రవిశంకర్‌ పోటీచేశారు. సాయిచరణ్‌కు 736, రవిశంకర్‌కు 735 ఓట్లు రావడంతో ఒక్క ఓటు తేడాతో సాయిచరణ్‌ సర్పంచ్‌గా గెలిచారు.

కోడల్ని గెలిపించిన మామ
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్‌లో ముత్యాల శ్రీవేద ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమెకు 189, ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపులో ప్రత్యేకత ఏమిటంటే—శ్రీవేద మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి ఓటు వేయడం. అదే ఓటు ఆమె విజయంలో కీలకమైంది.

వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఇదే కథ
వికారాబాద్ జిల్లా రాంపూర్‌లో గొల్ల రమాదేవి 117 ఓట్లతో, ప్రత్యర్థి మౌనికపై (116) ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతంగల్ కుర్ధులో సంతోష్‌ (280) ఒక ఓటుతో శ్రీనివాస్‌ (279)పై విజయం సాధించారు. కరక్‌వాడిలో సుధాకర్‌రావు (114) ఒక్క ఓటుతో చందర్‌రావు (113)పై గెలుపొందారు.

కరీంనగర్, రంగారెడ్డిలో ఉత్కంఠ
కరీంనగర్ జిల్లా ముంజంపల్లిలో కనకలక్ష్మి 898 ఓట్లతో కొమురమ్మ (897)పై గెలిచారు.
రంగారెడ్డి జిల్లా గుండాలలో బుచ్చిరెడ్డి 909 ఓట్లతో కాంతారెడ్డి (908)పై ఒక్క ఓటుతో సర్పంచ్ అయ్యారు.

వరంగల్‌లో మల్లమ్మ విజయం
వరంగల్ జిల్లా ఆశాలపల్లిలో మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు రావడంతో మల్లమ్మ ఒక్క ఓటుతో గెలిచారు. అధికారులు రెండుసార్లు లెక్కించినా ఫలితం మారలేదు.

డిగ్రీ విద్యార్థి సర్పంచ్
కరీంనగర్ జిల్లా పెద్దూరుపల్లిలో 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థి రామడుగు హరీశ్‌ 127 ఓట్లతో, ప్రత్యర్థి హరీశ్‌ (126)పై ఒక్క ఓటుతో విజయం సాధించారు.

రీకౌంటింగ్‌ తర్వాత తేలిన ఫలితం
శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌లో వడ్లకొండ వెంకటేశ్‌ (449) ఒక్క ఓటుతో వేగుర్ల ఎల్లయ్య (448)పై గెలిచారు. పలుమార్లు లెక్కించిన తర్వాతే తుది ఫలితం తేలింది. చిన్నచింతకుంట మండలం గూడూరులో భీమన్నగౌడ్‌ రీకౌంటింగ్‌ తర్వాత ఒక్క ఓటుతో గెలుపొందారు. ఈ ఎన్నికలు మరోసారి ఒక ఓటు విలువను గుర్తు చేశాయి. పల్లెల్లో ప్రజాస్వామ్యం ఎంత ఉత్కంఠభరితంగా ఉందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu OneVoteVictory SarpanchElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.