📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Latest News: TG: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ప్రభుత్వ గురుకుల విద్యాలయాల సంస్థ, వచ్చే విద్యా సంవత్సరం 2026–27కు సంబంధించిన ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో నాణ్యమైన విద్యను కోరుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు.. 6 నుంచి 9వ తరగతి వరకు వివిధ పాఠశాలల్లో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.

Read Also:  TET: జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

(TG) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 బాలబాలికల పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ఇక్కడ ఉచిత వసతితో కూడిన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం.

TG: Notification released for admissions in Gurukuls.. Full details!

దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21, 2026

దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఫోన్ నెంబర్ కీలకం. ఒక మొబైల్ నంబర్‌పై ఒకే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు వేర్వేరు నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. మీ-సేవ కేంద్రాల్లో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ 11 , 2025 కాగా.. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21, 2026 ప్రవేశ పరీక్ష తేదీ ఫిబ్రవరి 22, 2026.

దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఫొటో, ఇతర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఒకరి బదులు మరొకరి వివరాలు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తులో విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న పాఠశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Gurukul entrance test latest news Telangana Gurukul schools Telugu News TGPIS admissions TS education news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.