తెలంగాణ (TG) ప్రభుత్వ గురుకుల విద్యాలయాల సంస్థ, వచ్చే విద్యా సంవత్సరం 2026–27కు సంబంధించిన ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో నాణ్యమైన విద్యను కోరుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు.. 6 నుంచి 9వ తరగతి వరకు వివిధ పాఠశాలల్లో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.
Read Also: TET: జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు
(TG) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 బాలబాలికల పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ఇక్కడ ఉచిత వసతితో కూడిన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం చదువుతున్న తరగతి బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం.

దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21, 2026
దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఫోన్ నెంబర్ కీలకం. ఒక మొబైల్ నంబర్‌పై ఒకే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు వేర్వేరు నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. మీ-సేవ కేంద్రాల్లో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ 11 , 2025 కాగా.. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21, 2026 ప్రవేశ పరీక్ష తేదీ ఫిబ్రవరి 22, 2026.
దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఫొటో, ఇతర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఒకరి బదులు మరొకరి వివరాలు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తులో విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న పాఠశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: