పేదలకు అత్యాధునిక వైద్యం
హైదరాబాద్ (జూబ్లీహిల్స్) : పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarasimha) స్పష్టం చేశారు. (TG) నిమ్స్ లో ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ ల్యాబ్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రముఖ అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ తులసి థెరప్యుటిక్స్ సహకారంతో నిమ్స్ లో ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, ఒక పెద్ద వృక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో, మన శరీరానికి స్టెమ్ సెల్స్ కూడా అంతే ముఖ్యమని అన్నారు. విత్తనం నుంచి మహావృక్షం ఎలా తయారవుతుందో, అలాగే స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలు, అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మన శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా వ్యాధికి గురైన ప్పుడు, ఆ భాగాన్ని మరమ్మతు చేసే అద్భుతమైన శక్తి స్టెమ్ సెల్కు ఉందని మంత్రి తెలిపారు.
Read Also: Kavitha: సింహం గుర్తుతో బరిలోకి జాగృతి? మున్సిపల్ ఎన్నికలపై భేటీ
సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం
మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేసే సామర్థం ఈ చికిత్సకు ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి రుగ్మతలతో బాధపడే వారికి ఈ చికిత్స సంజీవని లాంటిదని తెలిపారు. (TG) ప్రస్తుతం స్టెమ్ సెల్ థెరపీ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమై, లక్షల రూపాయల ఖర్చుతో మాత్రమే అందుబాటులో ఉందని గుర్తు చేశారు. సామాన్య ప్రజలకు కూడా ఈ అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిమ్స్ ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ల్యాబ్లో స్టెమ్ సెల్స్పై లోతైన పరిశోధనలు జరుగుతాయని, తులసి థెరప్యుటిక్స్ శాస్త్రవేత్తలతో పాటు నిమ్స్ వైద్యులు కలిసి పరిశోధనలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో నిల్స్లోనే పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలమని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ ల్యాబ్లో జరిగే పరిశోధనల ఫలాలు ప్రజలకు అందుతాయన్నారు. కార్యక్రమంలో తులసి థెరప్యూటిక్స్ స్థాపకుడు, సీఈఓ డా. సాయిరాం అట్లూరి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: