TG Municipality Election: జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ పార్టీలకు 16 చొప్పున ఓట్లు రావడంతో డ్రా వేశారు. అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. రసాభాస మధ్య లక్కీ డ్రా తీయగా ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణిని అదృష్టం వరించింది. జనగామలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5 స్థానాలు గెలుచుకున్నారు. ఎక్స్అఫీషియోతో కలుపుకుంటే మేజిక్ ఫిగర్ 17 ఉండగా, రెండు పార్టీలకు 16 మంది సభ్యుల చొప్పున మద్దతు లభించింది.
Read Also: Indiramma illu : నిర్మాణం ఆగిన ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ గుడ్ న్యూస్
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇల్లెందు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోగా, దొడ్డ కిరణ్ మిత్ర ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకుంది. అయితే ఓటింగ్‌లో రెండు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రాలో కాంగ్రెస్‌ను అదృష్టం వరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: