📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

TG Municipal Elections: జిల్లా కలెక్టర్లకు SEC కీలక ఆదేశాలు

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (TG Municipal Elections) ప్రక్రియ మరో అడుగు ముందుకేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలను అత్యంత పారదర్శకగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సాధారణ, వ్యయ పరిశీలకులకు వారి విధులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

Read Also: TG: పిల్లలు తక్కువ… వృద్ధులు ఎక్కువ!జనాభాలో కీలక మార్పులు

వచ్చే వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

అభ్యర్థుల ఖర్చుల నియంత్రణ, ప్రవర్తనా నియమావళి అమలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అధికారులకు అవగాహన కల్పించారు. మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి, ఎస్‌ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన సాంకేతిక అంశాలను వివరించారు.వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష శిక్షణ అనంతరం రాణి కుముదిని 32 జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు.

TG Municipal Elections: SEC issues key instructions to district collectors

పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మౌలిక సదుపాయాలతో కూడిన కేంద్రాల గుర్తింపు, సున్నితమైన ప్రాంతాల మ్యాపింగ్, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు, ఇతర సామగ్రిని సిద్ధం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, శాంతిభద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది. రాబోయే వారం రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల (TG Municipal Elections) షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news state election commission Telangana Municipal Elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.