తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో, ఎన్నికలకు కొద్ది గంటల ముందు ద్రువ పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల నగదును ప్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ నగదును తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, కారులో ఈ నగదు లభ్యమైంది. ఎన్నికల నేపథ్యంలో, సోమవారం రాత్రే అభ్యర్థులు డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
Read Also: Telangana: టెట్ ఫలితాలు విడుదల
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: