📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG Municipal Elections: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Municipal Elections: తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. కాగా ఇబ్రహీంపట్నం మున్సిపలిటీలోని 19 వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. దీంతో అనూహ్యంగా కౌన్సిలర్‌ యాదగిరి బీఆర్​ఎస్​ క్యాంపులో కౌన్సిల్‌ ఎన్నికకు హాజరవటంతో హైకోర్టు ఎన్నికపై స్టే విధించింది.

Read Also: Korutla News: బురఖా ధరించి మహిళల మధ్య అనుమానితుడు..

ఏం జరగబోతోంది

ఇవాళ ఇవాళ కోర్టు విచారణకు కౌన్సిలర్ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ తనను మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. బపట్ల జిల్లా చీరాల తీసుకువెళ్లారని తాను బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉన్నానని అందువల్ల తనను బౌన్సర్లను పెట్టి మానసిసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని కోర్టుకు వివరించాడు.

TG Municipal Elections: Line clear for chairman election in Ibrahimpatnam Municipality

ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభపెట్టారని అందువల్ల మళ్లీ ఎన్నికను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోర్టును కోరారు.యాదగిరి వాదనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు రక్షణ ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు మున్సిపల్ పీఠంపై లైన్ క్లియర్ కావడంతో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ibrahimpatnam latest news Telugu News TG Municipal Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.