📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: మున్సిపల్ ఎన్నికలు.. ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన సీఎం రేవంత్

Author Icon By Anusha
Updated: January 19, 2026 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) లో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా CM రేవంత్ నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కేవలం ఎన్నికల నిర్వహణే కాకుండా, జిల్లాల పునర్విభజన వంటి కీలక పాలనాపరమైన మార్పులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడం వల్ల.. ఈ దఫా ఎన్నికలు మరింత పోటీతో కూడి ఉండే అవకాశం ఉంది.

Read Also: TG: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ క్లాసులు..

ఇన్‌ఛార్జ్‌లు

నియమించిన వారిలో ముఖ్యంగా.. నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంకు కొండా సురేఖ మంత్రులు ఉన్నారు. ఈ నియామకాల ద్వారా స్థానిక నాయకత్వంలో ఉన్న అసంతృప్తిని తొలగించి.. ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. మరోవైపు,పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కొత్త పథకాలకు అవకాశం ఉండదు కాబట్టి, సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy congress party latest news Municipal Elections Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.