తెలంగాణ (TG) రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.ఈ జాబితా ప్రకారం.. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పలు చోట్ల ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Read also: Yash: టాక్సిక్ టీజర్‌పై ఫిర్యాదు.. సీబీఎఫ్‌సీ కీలక ప్రకటన
తుది ఓటర్ల జాబితా ప్రకారం
అందులో పురుష ఓటర్లు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారని తెలిపింది. ఇక ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48, 051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మొత్తం 3,40,580 మంది ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: