TG: ఎసిబి వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్

Read Time:  1 min
TG: ఎసిబి వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
FONT SIZE
GET APP

రూ 20,000 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు

ఆత్మకూరు: (TG) ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండోసారి ఏసీబీ అధికారులు దాడులు చేసి మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన ఆత్మకూరు పట్టణంలో సంచలనంగా మారింది గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో కమిషనర్ రమేష్ బాబును అధికారితోపాటు బిల్ కలెక్టర్ భాస్కర్లను ఏసీబీ (ACB) అధికారులు నగదు 20,000 పట్టుకొని విచారణ ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు 20. వేల రూపాయలు లంచం ఏసీబీ వాళ్లకు చిక్కినట్లు ఎసిబీ డిఎస్పి సోమన్న, సీఐ బిఆర్ కృష్ణయ్యలు తెలిపారు.

Read Also: AP: ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

TG: ఎసిబి వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
Municipal Commissioner and Bill Collector caught in ACB net.

మరిన్ని శాఖలపై కూడా ఏసీబీ దృష్టి

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ (TG) ఆత్మకూరు పట్టణానికి కొత్తపేటకు చెందిన నాయబ్ సయ్యద్ సజ్జత్ అలీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు వీఎల్టి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ను సంప్రదించడం జరిగిందన్నారు. దీనికోసం మున్సిపల్ కమిషనర్ 20. వేలు ఖర్చు అవుతుందని తెలిపారని ఫిర్యాదుదారుడు బుధవారం ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపారు. 20 వేల రూపాయలను మున్సిపల్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి బిల్ కలెక్టర్ అయిన భాస్కర్ కి ఇవ్వాల్సిందిగా కమిషనర్ చెప్పినట్లు తెలిపారు.

ఫిర్యాదు దారుని సమాచారం మేరకు 20. వేలులంచం బిల్ కలెక్టర్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగిందన్నారు. బిల్ కలెక్టర్ ను విచారించగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకే 20వేల రూపాయలను తీసుకున్నట్లు తెలిపారు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ ఆయన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు ప్రాంతంలో అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపై తక్షణమే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆత్మకూరు పట్టణంలో మరో నాలుగు శాఖల అధికారులపై ఏసీబీ నిగా ఉన్నట్లు విశ్వనీయమైన సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.