📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG: పురపాలిక చట్టాన్ని సవరించాలి

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఎంకు రాష్ట్ర మున్సిపల్ చాంబర్స్ విజప్తి

ప్రస్తుతం తెలంగాణ (TG) రాష్ట్రంలో అమలవుతున్న పురపాలిక చట్టాన్ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కోరుతూ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని మున్సిపల్ ఛాంబర్స్ (Municipal Chambers) కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో నిర్వీర్యమైన అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్న రేవంత్ రెడ్డి, పురపాలిక వ్యవస్థ ఉనికికే ప్రమాదకారిగా మారిన 2019 పురపాలక నూతన చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్థానిక సంస్థలను కాపాడాలని కోరారు. స్థానిక సంస్థల ప్రాతినిధ్యం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి సమగ్రమైన పురపాలిక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

TG Municipal Act should be amended

Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

చట్టంపై విమర్శలు మరియు డిమాండ్లు

బిఆర్ఎస్ ప్రభుత్వం 2019 పురపాలక చట్టం తీసుకువచ్చి స్థానిక సంస్థలను అపహాస్యం చేసిందన్నారు. పురపాలక పాలకవర్గానికి ఈ చట్టం వల్ల ఏ అధికారాలు ఉన్నాయో ఒక్కసారి అధ్యయనం చేయాలని కోరారు. రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థల పటిష్టత కోసం 73, 74వ రాజ్యాంగ సవరణ చేసి పట్టణాలు, పల్లెల అభివృద్ధికి ఊతమిస్తే.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతో అధికారాలన్నీ అధికారులకు అప్పగించి, బాధ్యతలను మాత్రమే పాలకవర్గాలకు అప్పగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారి నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ చట్టాలతో స్థానిక సంస్థలపై అధికారాలు, అజమాయిషీలను జిల్లా కలెక్టర్లకు అప్పగించడంతో వారు సామంత రాజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగకుండా ఆర్థికంగా చితికిపోయి వారి పట్ల మరణ శాసనంగా మారాయని వాపోయారు.

పురపాలక సంఘాలపై అజమాయిషీని కలెక్టర్ల నుంచి సీడీఎంఏ (CDMA) కే అప్పగించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా తెలంగాణలో చట్టాలను పునఃసమీక్షించాలని కోరారు. పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలను నిర్వహించడం వల్ల సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. పురపాలక సంఘాల్లో పదవులకు రెండు పర్యాయాలు రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని వెన్రెడ్డి రాజు కోరారు. గత ప్రభుత్వం పురపాలికల ఉనికినే కోల్పోయే విధంగా విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్ఎల్ /ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసింగ్కు అప్పగించిందని, తక్షణం దాని నుంచి విముక్తి కల్పించాలని కోరారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

brs Chairman Venreddy Raju Google News in Telugu Latest News in Telugu Municipal Chambers Revanth Reddy Telangana Telugu News Today TG Municipal Act

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.