TG: శిశు విక్రయాల(Baby sales)ను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు పలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ విక్రయాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టలో శిశు విక్రయం జరిగింది. పోలీసులకు ఆ శిశువు కన్న తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నలుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
మహారాష్ట్ర వ్యక్తికి శిశు విక్రయం
ఆ శిశువు కన్న తల్లిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర (Maharashtra)లోని పుణేకు చెందిన విశాల్కు రూ.2.40 లక్షలకు శిశువును విక్రయించినట్లు పోలీసులకు ఆ కన్న తల్లి వెల్లడించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ శిశువును తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు.. పోలీసులు పుణే బయలుదేరి వెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: