బాగున్నరా.. అమ్మ !
రాష్ట్ర మహిళా మంత్రులకు..
కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ..
ఇంటికి వచ్చిన అతిథులకు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ సాదర ఆహ్వానం..
అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం..
Read also: Food safety : సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి
తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు గారు ఆత్మీయ ఆహ్వానం పలికారు.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల., మంత్రి దనసరి సీతక్క, గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు.
ఆత్మీయంగా పలకరింపు
ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ గారికి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా… తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.
కేసీఆర్ దంపతులు అందించిన, తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరంమంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.కాగా … తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,సాదర ఆహ్వానం పలికారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: