భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. (TG) మొదటి దశలో భాగంగా బిహార్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. ఆ తర్వాత రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దాని ప్రకారం ఒక్కో రాష్ట్రంలో భారీగా ఓటర్లను తొలగించింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 2.89 కోట్ల ఓటర్లను తొలగించింది. తర్వాతి దశలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
Read Also: TG: పార్టీ ఫిరాయింపుల కేసు.. దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు
ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు
తెలంగాణలో(TG) ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తంగా 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఉదహరిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 48.7, 2019లో 45.8, 20214లో 53.3 శాతం నమోదు అయింది. అయితే ఓటు వేయడానికి ఆసక్తి లేని కారణంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైందనే వాదనలు ఉన్నప్పటికీ.. ఆబ్సెంట్, షిఫ్టెట్, డెడ్ లేదా డుప్లికేట్ ఓటర్లు కూడా ఉండే అకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: