తెలంగాణ (TG) లోని, నిజామాబాద్‌లో శనివారం జరిగిన ఘోర ఘటనలో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య గాయపడింది. సౌమ్యను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. నిర్మల్ కు చెందిన గంజాయి ముఠా కారులో గంజాయి తీసుకెళ్తున్న క్రమంలో కారును అడ్డుకునేందుకు మహిళా కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించగా ఆమెను కారుతో ఢీకొట్టింది.
Read Also: TG Municipal Elections: జిల్లా కలెక్టర్లకు SEC కీలక ఆదేశాలు
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. అబ్కారీ అధికారులు మాధవనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా పెట్టారు. టీఎస్ 24 AF 4892 నంబరు గల కారులో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఎక్సైజ్ బృందం ప్రయత్నించింది. అయితే.. అధికారుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్మగ్లర్లు తమ కారును అధికారుల మీదికి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బంది తప్పించుకున్నప్పటికీ.. కానిస్టేబుల్ సౌమ్యను కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగంలో చేరి కేవలం 20 నెలలు మాత్రమే అవుతున్న యువ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పారిపోయే క్రమంలో కారును స్తంభానికి ఢీకొట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పోలీసులు కారు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: