📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Maoists: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

Author Icon By Saritha
Updated: October 11, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లొంగుబాటలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు

హైదరాబాద్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు శుక్రవారం నాడు డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక మహిళా. నాయకురాలు కూడా వున్నారు. లొంగిపోయిన ముగ్గురి పేరిట వున్న రివార్డును వారికి అందజేశారు. ఈ ఏదారి ఇప్పటి వరకు తెలంగాణలోనే 412 మంది మావోయిస్టులు (TG maoists) లొంగిపోయారని డిజిపి శివధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నక్సలిజానికి కాలం వెల్లినందున మావోయిస్టులంతా మారిన పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వ అభివృద్ధిలో గస్వాములు కావాలని ఆయన కోరాడు. రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కుంకటి వెంకటయ్య అలియాస్ రమేష్, అబియాస్ వికాస్ (52), మొగిలిచెర్ల వెంకట రాజు. అలియాస్ రాజు, అలియాస్ ఎర్ర రాజు (45), అతని భార్య తోదెం గంగ అలియాస్ గంగవ్వ ఊరప్ సోని 142)లు డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇందులో వెంకటయ్య సిద్ధిపేట జిల్లా మద్దూరు, కూటిగల్ గ్రామానికి చెందిన వ్యక్తి. 1988లో పదవ తరగతి చదువుతున్న సమయంలోనే పీపుల్స్ వార్ పార్టీ పట్ల ఆకర్షితుడై అందులో చేరాడు. మొదట చేర్యాల దశంలో వేని ఆ తరువాత పలుచోట్ల పదోన్నతులు పొంది దళ నాయకుడుగా ఎదిగాడు. 1998లో డిసిఎంగా ఎదగాడు. 2003 జిల్లా కార్యదర్శిగా 2005లో ఖమ్మం, కరీం నగర్, వరంగల్ జిల్లాలకు కార్యదర్శిగా బాధ్యతలు చేబట్టాడు. 2007లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ దర్భ డివిజనక్కు బదిలీ అయ్యాడు.

 Read also: ఫ్రాన్స్‌ ప్రధానిగా తిరిగి లెకోర్నుకే పగ్గాలు?

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ – ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగుబాటు

2015 రాష్ట్ర కమిటీ సభ్యుడుగా వదోన్నతి పొందారు. 2021లో దక్షిణ బస్తర్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యాడు. అయితే 2025లో పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంతో పాటు అనారోగ్య కారణాల వల్ల లొంగిపోవాలని నిర్ణయించుకుని శుక్రవారం నాడు డిజిపి ఎదుట లొంగిపోయారు. కాగా తన బొంగుబాటుపై వెంక టయ్య మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంక్షోభంతో పాటు తన అనారోగ్య కారణాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. మావోయిస్టు (TG maoists) పార్టీలో కొంతకాలంగా మారిన పరిస్థితులపై బొంగుబాట్ల గురించి చర్చ జరుగుతోందని అయన తెలిపారు. పార్టీలో అనేక సందర్భాలలో ఈ అంశంపై చర్చ జరిగిందని, అయితే అంతకు మించి తాను ఈ విషయంలో ఏమీ చెప్పలేనని అతను తెలిపాడు. కాగా మరో మావోయిస్టు మొగిలిచెర్ల వెంకటరాజు హనుమకొండ జిల్లా రర్జుసాగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వికాస్ 1990లో రాడికల్ సంఘంలో వేదాక అండలంచలుగా ఎదిగి పీపుల్స్ వార్లో కీలక సభ్యుడుగా ఎదిగాడు. 1995లో ఇతను మహాదేవపూర్ ఏరియా కమాండర్గానూ 1998లో సిఎంగానూ 2003లో కరీంనగర్, జిల్లా కార్యదర్శిగానూ 2005లో ఖమ్మం, వరంగల్ జిల్లాల కార్యదర్శిగానూ, 2007లో దండకారణ్య స్పెషల్ కో నల్ కమిటీ చార్యదలు నిర్వహించాడు. 2015 నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడుగా వున్నాడు. ఇతని భార్య మంజుల 2024లో పోలీసులకు లొంగి పోయింది.

ఆనారోగ్య సమస్యలతో పాటు మావోయిస్టు (TG maoists) పార్టీలో తెలెత్తిన అంతర్గత సమస్యల వల్ల చందు లొంగిపోయి నట్లు డిజిపి తెలిపారు. కాగా చందు భార్య తొదెం గంగ ఛత్తీస్ ఘడ్లోని సుక్మా జిల్లా కిష్టారం గ్రామానికి చెందిన వ్యక్తి. నిరక్ష్యదాన్యురాలైన గంగ 2004లో మావోయిస్టు పార్టీలో చేరారు. 2019లో చందుతో వివాహం జరిగింది. 2004 నుంచి అనేక హోదాల్లో పనిచేసిన గంత జనతన సర్కారులో కీలక బాధ్యతలు నిర్వహిం చింది. 2016లో దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శిగానూ 2021లో దక్షిణ బస్తన్ డివిజనల్ సెక్రటేరియట్ సభ్యురాలిగా వున్నారు. కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గంగ పార్టీలో తలెత్తిన సంక్షోభం వల్ల లొంగిపోవాలని నిర్ణయించుకు న్నారు. కాగా ముగ్గురి పేరిట వున్న తదా 20 లక్షల రూపాయల రివార్డును వారికి డిజిపి అందజేశారు. నక్సలిజానికి కాలం చెల్లింది.. రాష్ట్రంలో నక్సలైట్లు మిగిలిన 72 మందే కాగా నక్సలిజానికి కాలం చెల్లిందని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు.

నక్సలిజానికి కాలం చెల్లిందని డిజిపి శివధర్ రెడ్డి వ్యాఖ్యలు

నక్సలైట్లు ఆయుదాలు పట్టుకుని అడవుల్లో వుండడం కన్నా జనంలో వచ్చి ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 412 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో ఏడుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఎనిమిది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు పున్నారని ఆయన తెలిపారు. నక్సలైట్లు అంత భారీ సంఖ్యలో లొంగిపోవడం వెనుక పోలీసుల సమిష్టి వ్యూహం వుందని, ప్రభుత్వ ప్రోత్సాహం వుండని ఆయన తెలిపారు. ఇది మావోయిస్టులపై పోలీసులు విజయంగా డిజిపి తెలిపారు. మావోయిస్టు పార్టీలో జాతీయ స్థాయిలో 72 మంది జాత కేడర్లో వున్న వారు తెలంగాణకు చెందిన వారు వుండగా, 12 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో పది మంది తెలంగాణ (Telangana) వారే. వున్నారని డిజీపీ తెలిపారు. ఇక తెలంగాణ వరకు వస్తే ఇక్కడ 73 మంది నక్సలైట్లు వుండగా ఇందులో 61 మంది ఇతర రాష్ట్రాల వారు 12 మంది తెలంగాణ వారు వున్నారని ఆయన వెల్లడించారు. మావోయిస్టులు జనంలోకి రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. లొంగిపోయిన వారికి రివార్డులు ఇవ్వ డంతో పాటు సాధారణ జీవితం. గడిపేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆదనపు స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అదనపు డిజి విజయ్ కుమార్, ఎస్ఐబ్బ ఐజి సుమతి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

DGP Shivadher Reddy latest news Maoist Surrender naxalite surrender state committee members Telangana Maoists Telangana news telangana police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.