TG: బీఆర్ఎస్ శ్రేణులకి KTR సూచనలు

Read Time:  1 min
KTR letter
KTR letter
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు చిక్కుకోవద్దని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Telangana: స్పీకర్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన శిల్పి కేసీఆర్

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజల అసలు సమస్యల నుంచి చర్చను పక్కదోవ పట్టించేందుకే రేవంత్ రెడ్డి దూషణల పర్వాన్ని ఎంచుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, సంక్షేమ పథకాల అమలు వంటి మౌలిక వసతులపై చర్చ జరగాల్సి ఉండగా, సీఎం రేవంత్ తన ‘బూతు పురాణం’తో చర్చను నీరుగారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

TG: KTR's instructions to BRS ranks
TG: KTR’s instructions to BRS ranks

కేసీఆర్‌పై చేస్తున్న దాడిని తెలంగాణ (TG) పోరాట చరిత్రపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. “పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన శిల్పి కేసీఆర్. ఆయన ఏనాడూ బిరుదుల కోసం పాకులాడలేదు. ప్రజల సంక్షేమమే ఆయనకు అసలైన సత్కారం” అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.