ఫోన్ ట్యాపింగ్ (TG) చేయాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకువస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, మేడారం జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయి
(TG) ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. మొదట వ్యాపారవేత్తలు, తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పి, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అవసరం తమకు లేదని కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తుచేస్తూ, ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జనార్ తీర్పు చెప్పడానికి ఆయనేమీ జడ్జి కాదని, ఈ ఆరోపణల నిజానిజాలను కోర్టులే తేలుస్తాయని స్పష్టం చేశారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపిస్తూనే, సింగరేణి కుంభకోణంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. పైశాచిక ఆనందం కోసం కేసీఆర్‌ను అంతసేపు విచారణ పేరుతో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: