TG: రేవంత్ రెడ్డి మాట తీరు పై మండిపడ్డ కేటీఆర్

Read Time:  1 min
TG: రేవంత్ రెడ్డి మాట తీరు పై మండిపడ్డ కేటీఆర్
FONT SIZE
GET APP

అన్న ఎన్టీఆర్‌ను, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని (TG) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హామీల గురించి అడిగితే ‘లాగులో తొండలు విడిచిపెడుతా’, ‘గుడ్లు పీకి గోటీలు ఆడుతా’, ‘పేగులు తీసుకుని మెడలో వేసుకుంటా’ అని అంటున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు.

భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అసలు ఆయన రద్దు చేయడానికి, జిల్లాను ఆయన చేశాడా అని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు వీపు చింతపండు చేస్తారని కేటీఆర్ అన్నారు.

Read Also: Telanagana: ఏం చేసినా రెండేళ్లే: KTR

TG: రేవంత్ రెడ్డి మాట తీరు పై మండిపడ్డ కేటీఆర్
KTR lashed out at Revanth Reddy’s manner of speaking.

కేసీఆర్‌ను, కార్యకర్తలను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరిక

(TG) కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నీ టైమ్ అంతా రెండేళ్లే. ఆ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది. ఆ తర్వాత నువ్వు పాతాళంలో దాక్కున్నా వదిలి పెట్టం. కేసీఆర్‌తో పాటు మా కార్యకర్తలను అంటే ఊరుకునేది లేదు అని అన్నారు. తిడితే తనను, ఇతర నాయకులను తిట్టుకోవచ్చని, కానీ కేసీఆర్‌ను, బీఆర్ఎస్ కార్యకర్తలను తిడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎంతమంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్లను మొక్కుకున్నా అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టేది లేదని అన్నారు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని, లాగుల తొండల్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. సింగరేణిని రేవంత్ రెడ్డి, బావమరిది కలిసి దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలను ఆ పార్టీ నాయకులు ముంచుతారని హెచ్చరించారు. రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, రైతుబంధు పెంపు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే హామీలు అమలవుతాయని ఓటర్లకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.