📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై దాడిని (TG) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ నేతలు దిగజారిన రాజకీయానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు.

Read Also: Amrit Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

మల్లు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడమనేది కాంగ్రెస్‌ ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ దాడిని (TG) బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్‌ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఘటన వివరాల్లోకి వెళితే జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్‌ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. భూమిపూజలో ముందుగా ఎంపీ కొబ్బరికాయ కొట్టగా, అనంతరం ఎమ్మెల్యే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్‌ లేని వ్యక్తులతో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారని ఎంపీని, ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇది వివాదానికి దారి తీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Alampur MLA brs ktr KTR slams attack Latest News in Telugu Mallu Ravi Telugu News vijaya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.