📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: TG: కెటిఆర్ ఆరోపణలు పూర్తిగా అసత్యం: మంత్రి శ్రీధర్ బాబు

Author Icon By Saritha
Updated: November 22, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తేదానిని రూ.5 లక్షలకోట్ల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కెటిఆర్(TG) దుష్ప్రచారం సాగిస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫ్రీహోల్డ్ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు. కెటిఆర్(KTR) చెప్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740ఎకరాలే. మిగిలినభూమి రోడ్లు, డ్రెయినేజిలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించా రని పేర్కొన్నారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవి. ఆజమాబాద్, కూకట్పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్యహక్కులు కల్పించినది బిఆరెస్ ప్రభుత్వమే. కూకట్పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్టుమెంట్, జిఓఎంస్ 19,20,21లను 2023 ఆగస్టు 29న జారీ చేసింది. ఇప్పుడు ఆభూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. 30శాతం, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17న జరిగిన కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించారు.

Read also: కృష్ణా జలాలతో కుప్పం కల నెరవేర్చారు: భువనేశ్వరి

KTR’s allegations are completely false: Minister Sridhar Babu

రాజకీయ వ్యతిరేక ప్రచారాలపై మంత్రి ఆగ్రహం

అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలి. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై(TG) నిరాధార నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాయన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలన్నారు. పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఒలు ఇచ్చారు. ఆ భూములు మరొకరిపరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలన్నారు. వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించారని పేర్కొన్నారు. సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకు న్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. వారెవరూ ప్రభుత్వంలో లేరు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమి చేయాలో అదిచేస్తుంది. కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీలవల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే.

కన్వర్షన్ ఫీజుల ద్వారా రాష్ట్ర ఆదాయ పెంపు లక్ష్యం

యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరని పేర్కొన్నారు.. ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారిందన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నామన్నారు.. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదు. అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. బెదిరింపు ధోరణులు మానుకోవాలని కెటిఆర్కు సూచించారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కెటిఆర్ అవాస్తవాలు చెప్పారని ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవోలు తెచ్చారని గుర్తుచేశారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పే 30శాతం భూమి విలువ కాదని… కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమేనని తేల్చిచెప్పారు. ఫ్రీ హోల్డు… లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. కన్వర్షను… భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

freehold-rights hyderabad-development impact-fee industrial-land ktr-allegations land-conversion Latest News in Telugu sridhar-babu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.