గిరిజన (TG) జాతర మేడారం (Medaram) హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపునకు పది రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతర గత నెల 28 నుంచి 31 వరకు జరిగింది. సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. జాతరకు నెల రోజుల ముందు, జాతర అనంతరం మరికొన్నిరోజులు మేడారంను భక్తులు సందర్శిస్తారు.
Read Also: Ponnam Prabhakar: ప్లాస్టిక్ వాడకం తగ్గితే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది
(TG) మేడారం మహాజాతర సందర్భంగా అమ్మవార్ల హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. బుధవారం మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి హుండీల లెక్కింపును అధికారికంగా ప్రారంభించారు.
ఈ మహాజాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు నగదు, బంగారం, వెండి రూపంలో కానుకలు సమర్పించారు. హుండీల లెక్కింపు ప్రక్రియను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. గత మేడారం జాతరలో దాదాపు రూ.13 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి ఆ మొత్తాన్ని మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: