📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిజెఎస్ మద్దతు కోరిన మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ(TG)ఆవిర్భావంలో కోదండరాం(Kodandaram) పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని, నిస్వార్ధంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాల యంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటి అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిజెఎస్ మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెలుసుననన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ నిరంకుశ పాలన విముక్తి కోసం 2023లో మేమెంత కలిసి పోరాడామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి వారి సహకారం మరచి పోమని, ఉద్యోగ నియామక రూప కల్పనలో కోదండరాం సలహాలు సూచనలు విలువైనవని అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అను గుణంగా ప్రజా పాలన సాగుతుందన్నారు. జూబ్లి హిల్స్ ఎన్నికలో మద్దతు కోరినట్లు తెలిపారు. యువకుడైన నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీల మాదిరిగానే టిజెఎస్ మద్దతు కోరినట్లు తెలిపారు.

Read also: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు

TG: రాష్ట్ర సాధన కోసం కోదండరాం నిస్వార్ధ కృషి

బిజెపి మతవాద రాజకీయాలను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్

కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ ప్రశ్నించారు. కేంద్రమంత్రికి స్థాయి వ్యక్తి నోటికొచ్చింది మాట్లాడటం విచారకరం అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ రాజేసి లబ్ది పొందాలని బిజెపి నేతల వన్నాగం చేస్తున్నారని అన్నారు. జూబ్లిహిల్స్(TG) ఉప ఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మిత్ర పక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మిత్రపక్షంగా టిజెఎస్ పార్టీకి ఇచ్చిన హామీ మేరకు ప్రభు త్వంలో తగిన భాగస్వామ్యం కల్పించాలని, రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పలుచోట్ల టిజెఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా బిసి రిజర్వేషన్ల సాధన కోసం తీవ్రం గా కృషి చేయాలని, ఆ ప్రయత్నానికి టిజెఎస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో టిజెఎస్ రాష్ట్ర కమిటీసమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు గొప్పగాని శంకర్రావు, పల్లెవినయ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, నాయకులు మాసంపల్లి ఆరుణ్ కుమార్, సర్దార్జస్వంత్, బట్టల రామ చందర్, కొత్తరవి, ప్రశాంత్, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

BJP brs congress Jubilee Hills Bypoll Kodandaram Latest News in Telugu Mahesh kumar Goud Telangana Telangana politics Telugu News TJS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.