📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటరు మహాశయులకు నమస్కారం అంటూ ఎక్స్ వేదికగా ఓటర్లను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

Read Also: Telugu States: అప్పుడే మండుతున్న ఎండలు

Kishan Reddy wants BJP to win the elections

(TG) గత 12 ఏళ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి నిలిచిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. పట్టణాలు కనీసం వీధి లైట్లు కూడా లేక దుస్థితికి చేరుకున్నాయని, ప్రజలు నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యల కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Kishan Reddy Latest News in Telugu Municipal Elections Telangana Telugu News Urban Development Voter Appeal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.