📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కల్వకుంట్ల కవిత వార్నింగ్

Author Icon By Rajitha
Updated: November 24, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వనపర్తిలో జరిగిన జాగృతి ‘జనం బాట’ కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, ‘పుచ్చు వంకాయ’, ‘సచ్చు వంకాయ’ వంటి అవమానకర పదాలు ఉపయోగిస్తే ఇకపై సహించబోనని స్పష్టం చేశారు. ‘‘మా తండ్రి వయసు వారు కావడంతో ఇంతకాలం మౌనం పాటించాను. కానీ మరలా ఇలాంటి మాటలు మాట్లాడితే గట్టిగా ఎదురు స్పందిస్తాను’’ అని హెచ్చరించారు.

Read also: Drugs: న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Kalvakuntla’s poem warning to former minister Niranjan Reddy

ఆయనపై స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయ

కవిత మాట్లాడుతూ, నిరంజన్ రెడ్డి అవినీతి, అక్రమాలు వనపర్తి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. ఆయనపై స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ప్రజలు కూడా స్పష్టంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ‘‘ఈ విషయాలు కేసీఆర్‌ గారి దృష్టికి ఇప్పటి వరకు చేరలేదేమో అనిపిస్తోంది. అందుకే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను’’ అని కవిత పేర్కొన్నారు. మూడు ఫార్మ్‌హౌస్‌లు, అసైన్డ్ భూముల అంశాల్లో కూడా అనుమానాలు ఉన్నాయని ఆమె అన్నారు.

అలాగే బీసీలపై, ఉద్యమకారులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరైంది కాదని కవిత విమర్శించారు. తహశీల్దార్ కార్యాలయం కాలబెట్టిన ఘటనపై కూడా నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలపై నేను మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు? భూదాహం, ధనదాహానికి హద్దు ఉండాలి’’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BRS News kavitha latest news Niranjan Reddy Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.