TG: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసే పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish rao) నివాసానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత వెళ్లి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందగా, పలువురు ప్రముఖులు, నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో కవిత తన భర్త అనిల్‌తో కలిసి కోకాపేట్‌లోని హరీశ్ రావు ఇంటికి వెళ్లి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్ రావు కుటుంబ సభ్యులను ఓదార్చి, అక్కడి నుండి బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్లారు.
Read also: Jubilee Hills Election : 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలి..కేటీఆర్
TG: హరీశ్ ఇంటికి కల్వకుంట్ల కవిత: రాజకీయాల్లో అనూహ్య మలుపు
TG: ఇదిలా ఉండగా, ఇటీవల కవిత (kavitha) చేసిన వ్యాఖ్యలు హరీశ్ రావుపై తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. కాళేశ్వరం అవినీతి కేసులో తన తండ్రి కేసీఆర్ పాత్ర లేదని, అసలు వ్యవహారంలో హరీశ్ రావే కీలక పాత్ర పోషించారని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అంతకుముందు ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం కావడంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని అనుకున్నారు. అయితే తాజాగా కవిత హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారితీస్తోంది. హరీశ్–కవితల మధ్య సయోధ్యకు సంకేతమా? లేక ఇది కేవలం మర్యాద పరామర్శ మాత్రమేనా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరు” అని ఈ పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: