📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: కెజిబివి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

Author Icon By Saritha
Updated: January 19, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో కొనసాగుతున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని టిఎస్ యుటిఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కేజీబీవీల్లో(Kasturba Gandhi Girls’ School) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్ధాంతరంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Also: TGSRTC: 198 ట్రైనీ ఉద్యోగాలు – రేపే దరఖాస్తులకు చివరి అవకాశం

ప్రభుత్వానికి టిఎస్ యుటిఎఫ్ విజప్తి

సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన శనివారం (TG) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద జరిగిన కారు ప్రమాదంలో జిల్లా పరిషత్ హై స్కూలు ప్రధానోపాధ్యాయిని గీతారెడ్డితోపాటు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన మరణించారు. వారి మరణం పట్ల టిఎన్ యుటిఎఫ్ తీవ్రసంతాపం ప్రకటిస్తుందన్నారు. మరణించిన ఇరువురు ఒకేరకమైన విధులు నిర్వహిస్తున్నారని, మరణం ఒకటే అయినా కుటుంబాలకు అందే మరణానంతర ప్రయోజనాల్లో తీవ్రవ్యత్యాసం ఉందన్నారు. కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతకాలం పనిచేసినా వారికి నెలవారీ ఇచ్చే వేతనం మినహా ఏరకమైన ప్రయోజనాలు మాత్రం లేవని, ఆ వేతనం కూడా పనికి సమానమైన వేతనం కాదన్నారు.

అనారోగ్యానికి గురైనా, అర్ధాంతరంగా మరణించినా ఎటువంటి పరిహారం చెల్లించడం లేదని, కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. శనివారం రోడ్డు ప్రమా దంలో మరణించిన కల్పన కుటుంబం కడు పేదరికంలో ఉన్నదని, పిల్లలు చదు వుకుంటున్నారని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకో వాలని, పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి సర్వీసులో ఉండగా మరణించిన కేజీబీవీ ఉద్యోగి కుటుం బానికి కనీసం రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలన్నారు. కేజీబీవీ ఉద్యోగుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని చావ రవి, ఎ వెంకట్ ఆదివారం డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ContractEmployees EducationDepartment JobSecurity KGBVStaff Latest News in Telugu TelanganaGovernment Telugu News TSUTF

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.