📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG: సాంస్కృతిక విధానాన్ని నిర్ణయించాల్సింది పౌర సమాజమే

Author Icon By Tejaswini Y
Updated: January 8, 2026 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (చిక్కడపల్లి) : సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం నిర్ణయించడం
సరి కాదని, పౌరసమాజమే దాన్ని నిర్ణయించాలని – సాంస్కృతిక పాలసీ డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ(TG) కల్చరల్ పాలసీపై విశ్వనాథసాహిత్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం సాంస్కృతిక పాలసీ – డాక్యుమెంటిపై చర్చ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి(Justice B. Sudarshan Reddy) అధ్యక్షతన జరిగింది. సినీనటుడు, కవి, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి, డా. హరగోపాల్, డా. అనంత పద్మనాభరావు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు, తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు కె. యాదగిరి, రాఘవాచారి, భక్తవత్సల్, ప్రొఫెసర్జి, అజయ్, ప్రొఫెసర్ – వి.ఎస్. ప్రసాద్ బాలస్వామి, హరిప్రసాద్ ప్రభృతులు ఈ చర్చలో పాల్గొన్నారు.

Medak News : మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

TG: It is up to civil society to determine cultural policy.

మన సంస్కృతి విసృతమైనదని, గతంలో కూడా సంస్కృతిపై చర్చ జరిగిందని, అయితే ఎక్కడా ఒక విధానంగా నిర్ణయింపబడలేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఏ విధానమైనా మానవీయ ప్లై సంస్కృతితో ముడిపడి ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి వస్తే అది పోరాట, సంస్కృతి, ఉద్యమ సంస్కృతి.. కల్చర్ పాలసీ నిర్ణయించే ముందు తెలంగాణ సాంప్రదాయాలను కాపాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వెల్పాలకొండలరావు మాట్లాడుతూ సంస్కృతి గురించి ప్రభుత్వం చేసేదేంలేదన్నారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో విద్వేషపు రాజకీయాలున్నాయని, వాటికి వ్యతిరేకంగా విలువల్ని పెంపొందించాల్సిన అవసరముందన్నారు.

తెలంగాణ కల్చరల్ పాలసీ రూపొందించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించి ఆ బాధ్యతలను సినీ దర్శకులు బి.నరసింగరావుకి అప్పగించింది. ఇందులో భాగంగా తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం.. ప్రతిపాదన పేరుతో ఓ పత్రాన్ని సిద్ధం చేశారు. దీనిపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలను అంబటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, కె. రామచంద్రమూర్తి, జయరాజ్, నలిమెల భాస్కర్, భూపాల్, ఆచార్య ఎన్. భక్తవత్సల రెడ్డి, పెద్దింటి అశోక్ కుమార్, కందుకూరి రమేష్ బాబు, సానాయాదిరెడ్డి, డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఎస్ జీవన్ కుమార్, బి.ఎస్.రాములు, ఎ. రాజేంద్ర బాబు, డా. ఈమని శివ నాగిరెడ్డి, మాడభూషి శ్రీధర్, డాక్టర్ రమణాచారి తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

ఈ డాక్యుమెంట్ మరింత సమగ్రంగా వుంటుందని భావించి, విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో డాక్టర్ వెల్చాల కొండల రావు చర్చించారు. సాంస్కృతిక దిక్సూచి బి. నర్సింగ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి అత్యంత విలువైన పత్రాన్ని సమర్పించారు. సుదీర్ఘ సాహిత్య సాంస్కృతిక చరిత్ర కలిగిన ఈ తెలంగాణ మట్టిలో నిక్షిప్తమైన అనేక అంశాలను వెలి తీయడానికి, భద్రపరచడానికి, కొత్త విసృజించటానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని పోయే ఒక గొప్ప ప్రణాళికను రచించి ప్రభుత్వానికి ప్రతిపాదించడం గొప్ప విషయం.. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే, మరికొంత సమాచారాన్ని అదనంగా జోడిస్తే బాగుంటుందని కొండలరావు భావించి సమావేశాన్ని నిర్వహించడం విశేషం.

మన తెలంగాణ నాటకాలు, జానపదాలు, ప్రాచీన కాలంలో కళారూపాలను బతికించుకోవటానికి తగు చర్యలు తీసుకోవాలి.. అంతరించిపోతున్న మన అదిమ వారసత్వ కళాసంపదను పరిరక్షించుకోవాలి. దూర దర్శన్ ప్రాధాన్యత.. ప్రాముఖ్యత, ఆవశ్యకత వర్తమాన దూరదర్శన్అస్తిత్వాన్ని అటానమస్ చేయడంవల్ల ఎలా బడ్జెట్ లేక కునారిల్లుతోంది. పాతికేళ్ళుగా రిక్రూట్మెంట్ లేక పోవడం, ప్రైవేట్ ఛానల్స్ పోటీ ఎక్కుకావడం, వాటి పోటీకి తట్టుకొనినిలబడే ఆర్థిక వనరులు లేకపోవడం తదితర విషయాల పై చర్చ జరిగింది.

TG It is up to civil society to determine cultural policy.

ప్రస్తుతం అన్ని రంగాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ .. కొరవడుతున్నాయి. మీడియాలో విజువలైజేషన్ ను సరిగా వాడుకోవడంలేదు. దూరదర్శన్ జనాకర్షణ కార్యక్రమాలు రూపొందించాలి. ప్రభుత్వాలు, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలతో సంబంధాలు పెట్టుకోవడంలేదు. ప్రభుత్వ మీడియాను ప్రభుత్వ కార్యక్రమాలతో ఎలా అను సంధించాలన్న విషయంపై చర్చ జరిగింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోను ఈతరం దాదాపుగా మరిచిపోయారు. పురాతనమైన తెలంగాణ కళారూపాల పరిరక్షణకు డాక్యుమెంటేషన్ అవసరం వుందని వారు అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cultural Debate Cultural Policy Discussion Google News in Telugu Telangana Cultural Policy Telangana Culture Viswanatha Sahitya Vedika

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.