TG: సమాచారం లేదంటున్న తెలంగాణ పోలీసులు హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుందా…? ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న, మల్లోజుల కోటేశ్వరరావు సతీమణి సుజాత సహా పలువురు ముఖ్య నాయకులు, వందల సంఖ్యలో క్షేత్ర స్థాయిలోని కేడార్ తెలంగాణ, (Telangana) ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవడం తెలిసిందే. వీరి లొంగుబాటును మావోయిస్టు పార్టీ కుట్రగా అభివర్ణిస్తూనే లొంగిపోయిన వారంతా ద్రోహులని పేర్కొనడం విదితమే. అయినప్పటికీ మావోయిస్టుల వరుస లొంగుబాట్లు ఆగడం లేదు. తాజాగా ఆదివారం నాడు ఛతీస్ గాడ్ లో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తమ కేడర్తో కలిసి లొంగిపోయారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగులబోతోందని ప్రచారం జరుగుతుంది.
Read also: Girish Kumar Sanghi:మెరుగైన సేవల్లో అగ్రసేన్ బ్యాంక్ మేటి
TG: లొంగుబాటలో మావోయిస్టు టాప్ లీడర్ హెడ్మా?
TG: ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు, పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కా ర్యదర్శి మాడవి హిడమ్ముయ్ అలియాస్ హిడ్మా (Hidma) పోలీసులకు లొంగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సహచరులతో పాటు భారీగా ఆయుధాలతో ఆయన లొంగిపోయేందుకు నిర్ణయించి నట్లుగా కూడా చెబుతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న తరహాలో భారీ కేడర్తో కలిసి లొంగిపోయేందుకు హడ్మా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ముఖ్యమైన వారిలో ఒకరుగా పేరొందడం తెలిసిందే. ఛతీస్ గాడ్ లో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా సూత్రధారిగా వుండడం గమనార్హం. గెరిల్లా యుద్ద తంత్రంలో హిడ్మా ఆరితేరినట్లు పోలీసులు పలుమార్లు ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్లోని సుకుమా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా గిరిజనతెగకు చెందిన వ్యక్తి. గిరిజనులను పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేర్పించడంలో ఆయన చొరవ తీసుకున్నారని మావోయిస్టు పార్టీ అనేకమార్లు ప్రకటించింది.
హిడ్మా లొంగుబాటు కోసం ఛత్తీస్ ఘడ్. (chhattishrarh) తెలంగాణ పోలీసు విభాగాలు అంతర్గతంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. హిడ్మాపై ఛతీస్ గాడ్ లో పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఇందులో మెజారిటీ కేసులు భద్రతాబలగాలపై దాడులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇదే సమయంలో ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ, ఎపిలోనూ కేసులున్నాయి. కాగా హిడ్మా లొంగిబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ పోలీసులు చెబుతుండగా ఛత్తీస్ ఘడ్ పోలీసులు మౌనం వహించసాగారు. గతంలో మల్లోజుల వేణుగోపాల్రావు, ఆశన్నల లొంగుబాటు సందర్భంగా కూడా పోలీసులు మౌనం వహించారు. హిడ్యాపై ఐదుకోట్ల రూపాయలకు పైగా రివార్డు వుంది. హిడ్మా లొంగి పోతే మావోయిస్టుపార్టీలో ముఖ్యనాయకులు ఐదారుగురు మాత్రమే వుంటారని పోలీసులు చెబుతున్నారు.
హిడ్మా ఎవరు?
హిడ్మా అసలు పేరు మాడవి హిడమ్ముయ్. ఆయన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ కీలక నాయకుడు.
హిడ్మా లొంగిపోతున్నాడనే వార్త ఎందుకు చర్చనీయాంశమైంది?
మావోయిస్టు పార్టీలో వరుసగా ప్రధాన నాయకులు లొంగిపోతున్న సమయంలో హిడ్మా కూడా పోలీసులకు లొంగబోతున్నాడని వార్తలు రావడంతో ఆసక్తి పెరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: