TG: తెలంగాణ ఇంటర్ బోర్డు అన్ని జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ (Lab) లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ ఈవాల్యూయేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నందున ప్రతి కాలేజీలో ల్యాబ్‌లు ఉండాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా తప్పనిసరి అని సూచించింది.
Read also: Azharuddin: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అజారుద్దీన్ ఆగ్రహం
INTER బోర్డు కొత్త ఆదేశాలు
TG: ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ చైతన్య మాట్లాడుతూ, కొత్త ఇంటర్నల్ విధానం విద్యార్థుల్లో ప్రాక్టికల్ అవగాహన పెంచి, సబ్జెక్టులపై లోతైన అర్థం కలగడానికి దోహదం చేస్తుందని చెప్పారు. ఈ చర్యలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని, పరీక్షల పారదర్శకత కాపాడబడుతుందని తెలిపారు. అదనంగా, ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: