📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG: ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ప్రారంభం

Author Icon By Anusha
Updated: November 19, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా (TG) రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Read Also: TG 2047: తెలంగాణ రైజింగ్ తో కొత్త పుంతలు సమగ్ర భవిష్యత్తును నిర్మిద్దాం: డిసిఎం భట్టి

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పాలన బలహీన వర్గాలకు సువర్ణ అధ్యాయమని, ఆమె పరిపాలన ఒక మోడల్ అని కొనియాడారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో ‘ప్రజాపాలన’ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతోనే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ జయంతి రోజు అయిన నేడు ప్రారంభించి డిసెంబర్ 9 వరకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.

TG: Indiramma Saree Distribution Scheme Launched

మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం

చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తామని మొత్తం కోటి చీరలను రెండు విడతలుగా అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

తమ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు, ఆర్థిక ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయమని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి’ పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Indira Gandhi Jayanti Indiramma Saree Scheme latest news Revanth Reddy Telangana government welfare Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.