📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: TG: గతేడాది భారత్ బొగ్గు రంగం గణనీయమైన ప్రగతి

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: TG గతేడాది భారత బొగ్గు(Coal) రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించిన పురోగతిని సాధించాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy) పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కోల్ పీఎస్‌యూల అర్ధవార్షిక సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలల సమయం ఉన్నందున, ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని, ముఖ్యంగా ఉత్పత్తి విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు.

Read Also: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

TG

సంస్కరణలు, సాంకేతికత వినియోగం

గతంలో వర్షాల కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగినా, తర్వాత పుంజుకుని ఉత్పత్తిపై దృష్టి సారించాలని అన్ని సబ్సిడరీల సీఎండీలకు మంత్రి సూచించారు. వచ్చే మూడున్నరేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ఆధారంగానే నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, బొగ్గు రంగంలోనూ వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు. మన వద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి అత్యాధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. సాంకేతికతను వాడుకుంటూ, వ్యవస్థను మరింత సరళంగా, ఫలితాలు సాధించేలా మార్చుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇతర సబ్సిడరీలలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకుని అమలు చేయాలని, అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పాటించాలని చెప్పారు.

క్రిటికల్ అంశాలపై దృష్టి, లక్ష్యాలు

సీఎంపీడీ (సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్) ఓవర్ బర్డన్ టెస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిపై పనిచేయాలని మంత్రి సూచించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ త్వరగా అనుమతులు ఇస్తోందని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. కోల్ వాషరీస్ విషయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, దీనివల్ల బొగ్గు దిగుమతులు తగ్గుతాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

coal sector energy production G Kishan Reddy Google News in Telugu Latest News in Telugu public sector undertakings technological reforms. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.