📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: TG: రాష్ట్ర ప్రభుత్వ చేతికి హైదరాబాద్​ మెట్రో

Author Icon By Saritha
Updated: November 21, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ మెట్రోకు కీలకమైన మార్చి

రాబోయే మార్చి నెల హైదరాబాద్‌(Hyderabad) మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి నిర్ణయాత్మకంగా మారనుంది. (TG)మార్చి 31 లోపే ఎల్‌ అండ్‌ టీ నిర్వహిస్తున్న తొలి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి మార్చిలో తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది.

మెట్రోరైలు 2(ఎ)లో మొత్తం 5 రూట్లు, 2(బి)లో 3 రూట్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ రెండు మార్గాలను కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించడంతో రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి వివరాలు పంపింది. మొదటి దశ మెట్రో నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీతో సాగిన చర్చల్లో ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయడానికి సంస్థ సానుకూలంగా ఉందని తెలియడంతో ప్రక్రియలో ఉన్న ప్రతిష్ఠంభన తొలగింది. దీంతో టేకోవర్‌కు అవసరమైన అన్ని చర్యలను మార్చి 31 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Read also: అధిక సుంకాలతో అమెరికాకే డ్యామేజ్ తో దిగొచ్చిన ట్రంప్

Hyderabad Metro in the hands of the state government

కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో స్పష్టత

ఎనిమిది మార్గాల్లో మెట్రో(TG)విస్తరణకు రాష్ట్రం అనుమతులు కోరగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మార్చిలోపే అనుమతులపై తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు, ఇప్పటికే మెట్రోపై రూ.13 వేల కోట్ల రుణభారం ఉండటం, సాంకేతిక సమస్యలు ఉండటం వల్ల ఆర్థిక, నిర్మాణ అంశాల్లో పునర్వ్యవస్థీకరణ అవసరం ఉంది. సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, సుచిత్ర, అల్వాల్ ఘట్‌కేసర్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు భారీగా ఎంఎంటీఎస్‌పై ఆధారపడుతున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో రైళ్ల సంఖ్య సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 15 కోచ్‌ల మెమూ రైళ్లు ప్రవేశపెట్టి, ప్రతి 10–15 నిమిషాలకు రైళ్లు నడిపితే ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌లో నడుస్తున్న 12 కోచ్‌ల రైలు 3,500–3,800 మంది వరకు తీసుకురాగలదు. అయితే 15 కోచ్‌ల మెమూ రైలు 4,500–5,000 మంది వరకు తీసుకురావచ్చు. కోచ్‌లు పెరగడంతో 30–40% అదనపు సామర్థ్యం లభిస్తుంది. లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గంలో 15–20 నిమిషాలకో రైలు నడుస్తుండగా, ఈ వ్యవధిని 10 నిమిషాలకు తగ్గిస్తే సేవలు మరింత మెరుగవుతాయి. ఈ మార్గంలో ఒక్కో ఎంఎంటీఎస్ రైలులో రోజూ 3,000–4,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో రైళ్లు నడపకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడుతూ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రూట్‌లో రైళ్ల సంఖ్య పెంచాలని చాలా మంది కోరుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Hyderabad Metro Hyderabad Traffic L&T handover MEMU coaches Metro Expansion MMTS trains Telangana metro update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.