📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: TG High court: ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

Author Icon By Pooja
Updated: December 14, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వారి సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా కంపెనీలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని కోర్టు (TG High court) వ్యాఖ్యానించింది. ముఖ్యంగా సర్వీస్ అగ్రిమెంట్ పేరుతో భారీ మొత్తాలను డిమాండ్ చేయడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తింది.

Read Also: TG Crime: ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

TG High court

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల హక్కులపై TG హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ కేసులో ఒక సాఫ్ట్‌వేర్(Software) ఉద్యోగి, సంస్థ విధించిన నిబంధనలు అన్యాయంగా ఉన్నాయని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఉద్యోగం నుంచి వైదొలిగినందుకు రూ.5.9 లక్షలు చెల్లించాలంటూ కంపెనీ ఒత్తిడి తెచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు, ఆ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో వివరించాలని కార్మిక శాఖను ఆదేశించింది.

అలాగే ఉద్యోగి రాజీనామాను పెండింగ్‌లో ఉంచడం సరికాదని, వెంటనే ఆమోదించాలని సంబంధిత సంస్థకు హైకోర్టు(TG High court) సూచించింది. ఉద్యోగ ఒప్పందాల్లో స్పష్టత, న్యాయబద్ధత ఉండాలని, లేదంటే ఉద్యోగుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు హెచ్చరించింది.

ఈ తీర్పు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే లక్షలాది ఉద్యోగులకు ఊరటనిచ్చేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇకపై సర్వీస్ అగ్రిమెంట్లలోని కఠిన నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని హైకోర్టు సూచించినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

employee rights Google News in Telugu Latest News in Telugu Service Agreement Software Employees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.