తెలంగాణ (TG) రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్న అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రెండు వారాల్లోగా స్పష్టమైన నివేదిక సమర్పించాలని, కాలేజీల నుండి వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పట్ల ఉన్న బకాయిలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: HYD: వరంగల్ భద్రకాళి అమ్మవారికి భక్తుడి భారీ కానుక
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: