📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Latest News: TG High Court: ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Author Icon By Anusha
Updated: December 8, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి హైకోర్టు (TG High Court) లో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అక్టోబరులో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: TG: రామగుండం థర్మల్ మూసివేత

తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా

అయితే.. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీఓపీటీ తెలంగాణ హైకోర్టు (TG High Court) లో అప్పీల్‌కు వెళ్లింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్ ఆమ్రపాలి (IAS Amrapali) తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.

TG High Court: IAS Amrapali faces setback in the High Court

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆమ్రపాలిని హెచ్ఎండీ జాయింట్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు. అయితే డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత క్యాట్‌లో అప్పీలు చేయగా.. తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. క్యాట్ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cadre allocation dispute CAT order stayed IAS Officer amrapali latest news Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.